బిగ్ బాస్ నిర్వాహకులకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం నోటీసులు అందించారు. బిగ్ బాస్ సీజన్ – 7 తెలుగు ఫినాలే అనంతరం జరిగిన ఘర్షణకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ యాజమాన్యం ఎండమోల్ షైన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌కు ఈ నోటీసులను జారీ చేశారు. కాగా గత ఆదివారం బిగ్ బాస్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవ కారణంగా బస్సులు, పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో రెండు రోజుల క్రితం విడుదలయ్యారు.