KMR: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్న వారిపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం ఎన్ఫోర్స్మెంట్ అధికారి సురేష్ ఆధ్వర్యంలో పిట్లం మండల కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 8 కేసులు నమోదు చేసి, 10 అక్రమ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.