MBNR: పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ 2,4,6వ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువును పొడిగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులు శనివారం వినతిపత్రం సమర్పించారు. యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ ప్రవీణను కలిసి, పేద విద్యార్థుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గడువు పెంచాలని జిల్లా కార్యదర్శి రాము డిమాండ్ చేశారు. అలాగే దీనికి ఎలాంటి ఫైన్ యాడ్ చేయవద్దని కోరారు.