NRML: జిల్లాలో ‘పోలీస్ అక్క’ కార్యక్రమం జాతీయ స్థాయి గుర్తింపు పొందడం పట్ల ఎస్పీ జానకి షర్మిల హర్షం వ్యక్తం చేశారు. మహిళా పోలీస్ సిబ్బంది నిబద్ధత వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. విద్యార్థినులు భయం వీడి పోలీసులను నమ్మకంగా ఆశ్రయించడం ఈ కార్యక్రమం సాధించిన అసలైన విజయమని ఆమె పేర్కొన్నారు.