MDK: నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమన్నారు. మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఛైర్మన్, కౌన్సిలర్ల సహకారంతో 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను గణనీయంగా తగ్గుతాయన్నారు.