MBNR: నవాబ్‌పేట మండలం కరూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, గ్రామపంచాయతీ బిల్డింగును ఎంపీడీవో జయరాం నాయక్ పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతలలోనే నిర్మించాలన్నారు. అనంతరం MGNREGS, ల్యాండ్ లెవెలింగ్ పనులను పరిశీలించి, సకాలంలో డబ్బులు అకౌంట్లో పడుతున్నాయా అని కూలీలతో ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.