HNK: హసన్పర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల సమస్యలను వ్యవసాయ కార్మిక సంఘం నేతలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు మాట్లాడుతూ.. కూలీలకు పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించాలని, పనిచేసిన కూలీలకు 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని, 200 రోజుల పని దినాలు కల్పించాలన్నారు.