NGKL: జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు DEO గోవిందరాజుల రమేశ్ కుమార్ తెలిపారు. శనివారం కల్వకుర్తి, తాడూర్ మండలాల్లోని పలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కల్వకుర్తి జేపీ నగర్ గురుకులం, తాడూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలను సందర్శించి వసతులు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు.