WNP: జిల్లాలో శనివారం జరిగిన పదో తరగతి గణితం పరీక్షకు 7,212 మంది విద్యార్థులు హాజరు కాగా, 11 మంది గైర్హాజరైనట్లు డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పలు కేంద్రాలను తనిఖీ చేసి, నిబంధనల అమలును పర్యవేక్షించాయి.