ELR: ముసునూరు బాలికల గురుకుల పాఠశాలలో చట్టాలపై బాలికలకు శనివారం అవగాహన కల్పించారు. నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. 18 ఏళ్ళు నిండని బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో చట్టం రక్షణగా ఉందని చెప్పారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే అనర్ధాలు తప్పమని హెచ్చరించారు.