AP: అమరావతికి బుల్లెట్ ట్రైన్, అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్ ఏ సంవత్సరంలోగా తీసుకువస్తారో చంద్రబాబు చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. చంద్రబాబు చెబుతున్న 2028లోగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు మాత్రమే పూర్తి చేస్తామంటున్నారు. రైతులకు వాళ్ల ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించారా? అని ప్రశ్నించారు. వాళ్ల ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియక రైతులు ఏడుస్తున్నారన్నారు.