PDPL: ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి మట్ట సరిత ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ.. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, లోక్ అదాలత్ సభ్యులు ఆకారి రాజేశం, నూనె సత్యనారాయణ, ఇతర న్యాయవాదులు సంపత్, ప్రకాష్, కక్షిదారులు పాల్గొన్నారు.