ఆప్గానిస్తాన్ స్టార్ పేసర్ నవీన్ ఉల్ హక్‌పై అంతర్జాతీయ లీగ్ టీ20 20 నెలల నిషేధం విధించింది. షార్జా వారియర్స్‌తో తన ఒప్పందం నిబంధనలను ఉల్లంఘించినందుకు నవీపై ఈ చర్య తీసుకుంది.
షార్జా వారియర్స్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆప్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్(Afghanistan pacer) నవీన్ ఉల్ హక్‌పై అంతర్జాతీయ లీగ్ టీ20 (ILT20) క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనకుండా 20 నెలల నిషేధం పడింది. ఈ టోర్నీ మొదటి సీజన్ కోసం నవీన్ వారియర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతనికి మరో ఏడాది పాటు కాంట్రాక్ట్ పొడిగింపు ఆఫర్ చేయబడింది. కానీ ఫాస్ట్ బౌలర్ రెండో సీజన్ కోసం ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు.
Breaking: Naveen Ul Haq has been banned for 20 months from participation in International League T20 due to breach of contract – via CricTracker.
ఆఫ్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్(Naveen Ul Haq) ఇంటర్నేషనల్ లీగ్ T20 మొదటి సీజన్లో షార్జా వారియర్స్ తరపున 9 మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఫ్రాంచైజీ నవీన్‌తో ఒక సంవత్సరం ఒప్పందాన్ని పొడిగించాలని కోరుకుంది. అయితే నవీన్ సంతకం చేయడానికి నిరాకరించాడు. ఇది నవీన్, షార్జా వారియర్స్ మధ్య వివాదం తీవ్రమైంది. దీనిని ILT20 పరిష్కరించడానికి జోక్యం చేసుకోవలసి వచ్చింది. సమస్య పరిష్కారం కానప్పుడు, ILT20 ముగ్గురు సభ్యులతో కూడిన క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసి, ఈ విషయాన్ని విచారించింది. దీంతో నవీన్‌పై 20 నెలల నిషేధం విధించారు.
టోర్నమెంట్ మొదటి సీజన్లో షార్జా వారియర్స్‌తో కాంట్రాక్ట్‌ను గెలుచుకున్న నవీన్‌కు ఒక సంవత్సరం పొడిగింపు ఆఫర్ చేయబడింది. కానీ అతను రెండవ సీజన్ కోసం రిటెన్షన్ నోటీసుపై సంతకం చేయడానికి నిరాకరించాడు. ఆ తర్వాత అతడిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ILT20 CEO డేవిడ్ వైట్ ఇలా అన్నారు. మేము ఈ ప్రణాళికను రూపొందించినందుకు గర్వపడటం లేదు, అయితే అన్ని పార్టీలు వారి ఒప్పంద కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలని సమ్మతించకపోవడం ఇతర పక్షానికి నష్టం కలిగించవచ్చని అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నామని చెప్పారు. దురదృష్టవశాత్తూ నవీన్ షార్జా వారియర్స్‌తో తన ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేకపోయాడని అన్నారు. ILT20 రెండవ సీజన్ వచ్చే ఏడాది జనవరి 19న ప్రారంభమై ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది.