Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాతో పాటు పలువురు స్వాగతం పలికారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఐదు రోజుల సెలవుల అనంతరం 23న తిరిగి వెళ్లనున్నారు. ఈ ఐదు రోజుల్లో రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.