WGL: వేసవికాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని పంపిణీ చెయ్యనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి నెల 16.50 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరుగుతోంది. కానీ ఏప్రిల్ నెలలో ఒకేసారి 49.50 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేయడానికి పౌర సరఫరాల అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.