KRNL: ఆదోని మండలం మండగిరి పంచాయతీ పరిధిలో ఇవాళ ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ హాజరయ్యారు. అనంతరం గ్రామ పరిశుభ్రత, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని ఆమె పేర్కొన్నారు.