‘ధురంధర్ 2’ సినిమాపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. అది హింసను ప్రేరేపించే ఒక పనికిరాని చిత్రమని, అందులో బూతులు తప్ప ఏమీ లేవని మండిపడ్డారు. ముఖ్యంగా ముస్లింలను చూపించిన విధానాన్ని ఆయన తప్పుబట్టారు. సినిమా హిట్టయినా తనకేం పట్టదంటూ “ఐసే చీజాం కు హమ్ లైట్ లేతే” అంటూ తనదైన హైదరాబాదీ యాసలో కొట్టిపారేశారు.