NRML: యాసంగి (రబీ) వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను సమయానికి ప్రారంభించి గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా టెంట్లు, త్రాగునీరు వంటి వసతులు కల్పించాలని సూచించారు.