NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీల పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కే.అశ్విని మహేశ్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు.