»Kunamneni Sambasiva Rao This Is The Reason Brs Lost
Kunamneni Sambasiva Rao: బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఇదే!
బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు.
Kunamneni Sambasiva Rao: అసెంబ్లీ మొదటిరోజు సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడకుండా సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలన్నారు. కొత్త ప్రభుత్వానికి శుభాక్షాంక్షలు తెలిపి.. అసెంబ్లీ ఎక్కువ రోజులు నడిపేలా చూడాలన్నారు. 2020లో 17 రోజులు, 2023లో అసెంబ్లీ కేవలం 11 రోజులు మాత్రమే సభ నడిచిందన్నారు. సభలోని సభ్యులు ఆరోగ్యదాయంగా మాట్లాడాలి. ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చారన్నారు. జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయని అన్నారు.
హామీలు నెరవేర్చేందుకు డబ్బు ఇబ్బంది కాదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 హామీలు నెరవేర్చారు. ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నామని అన్నారు. ఓడిపోవడం అనేది సహజం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామనడం మంచిది కాదన్నారు. పాత ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అయ్యిందో చెక్ చేసుకుని కాంగ్రెస్ పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు.