పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నార్త్ అమెరికా వసూళ్లు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అక్కడ ఇప్పటివరకు ఈ చిత్రం కేవలం రూ. 6 కోట్లు మాత్రమే రాబట్టింది. కనీసం 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా అందుకోకపోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ. 7 కోట్లు సాధించాలి, లేదంటే భారీ నష్టాలు తప్పవు.