ATP: అమరావతి అందరికీ అనుకూలమైన ప్రాంతమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అసెంబ్లీలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాజధానిపై కుట్రలు, దుష్ప్రచారాలు చేసిందని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో అమరావతికి తిరిగి ఊపిరి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. రాజధానికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.