NLG: చింతపల్లి మండలం గొడకొండ్లలో శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వార్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం రథోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.