బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రియురాలు, నటి సబా ఆజాద్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. ‘సైక్లోస్పోరా కయెటానెన్సిస్’ అనే పరాన్నజీవి ఇన్ఫెక్షన్ సోకడంతో గత 14 రోజులు తన జీవితంలోనే అత్యంత భయంకరమైనవని ఆమె ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ ఇన్ఫెక్షన్ నేరుగా కడుపుపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఆమె కోలుకోవాలని హృతిక్ అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.