BDK: మణుగూరు పట్టణంలో కొంతమంది యువకులు నిబంధనలకు విరుద్ధంగా బైకులకు సైలెన్సర్లు అమర్చి నడుపుతున్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి సురక్ష బస్టాండ్ వరకు ప్రధాన రహదారిపై మితిమీరిన వేగంతో చెవులకు చిల్లులు పడే భారీ శబ్దాలతో బైక్లు నడుపుతుండడంతో స్థానికులు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ వారు చర్యలు తీసుకోవాలని కోరారు.