KNR: శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా కొక్కెరకుంట, వన్నారం గ్రామాల్లో SRR ప్రభుత్వ కళాశాల NSS విద్యార్థులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.