WNP: ఆత్మకూరు పట్టణంలో పెట్రోల్ కొరత ఒక్కసారిగా తలెత్తింది. శుక్రవారం సాయంత్రం నుంచి అనేక పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధనం కోసం కిలోమీటర్ల దూరం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.