నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక మలుపుకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.