RR: కోహెడలో 178 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్తగా డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు రూ.1901 కోట్ల వ్యయంతో ఈ మార్కెట్ నిర్మాణం జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు.