CTR: ప్రమాదవశాత్తు బావిలో పడిన దుప్పిని గ్రామస్తులు రక్షించిన ఘటన బైరెడ్డిపల్లి మండలంలోని గొల్లచీమనపల్లెలో జరిగింది. ఒక దుప్పి గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతం నుంచి వ్యవసాయ పొలాల్లోకి వచ్చింది. ప్రమాదవశాత్తు పాడుబడిన బావిలో పడిపోయింది. గమనించిన రైతులు ఈ విషయాన్ని యువకులకు తెలిపారు. బావి నుంచి పైకి తీసి అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.