TPT: నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి శుక్రవారం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా పసల చెంగయ్య ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా తలారి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా గోళ్ళ వీరాస్వామి ఎన్నికయ్యారు. ఇతర పదవులకు కూడా సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.