బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ “కిసీ క భాయ్ కిసీ క జాన్” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బుట్టుబొమ్మ పూజాహెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్, పూజా హెగ్దే అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ కొత్త సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఒక యాక్షన్ ఎపిసోడ్స్ గా సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఫైట్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేషాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే టీజర్ లో పూజా హెగ్దే బతుకమ్మ ఎత్తినట్లు ఉంది. మొత్తానికి టీజర్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.