World’s Largest Office Building: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం మన దేశంలోనే ప్రారంభం కానుంది. వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన గుజరాత్‌లోని సూరత్‌లో ఈ భవనం నిర్మించబడింది. డిసెంబర్ 17న సూరత్ డైమండ్ బోర్స్ (SDB) భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 3,500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 4,500 డైమండ్ ట్రేడింగ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకునేలా దీన్ని నిర్మించారు. ఈ భవన నిర్మాణం ఫిబ్రవరి 2015లో ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టులో డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో భాగమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భారీ భవనంలో తొమ్మిది టవర్లు, 15 అంతస్తులు ఉన్నాయి. 300 చదరపు అడుగుల నుండి 1 లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి. ఈ భవనానికి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుండి ప్లాటినం ర్యాంకింగ్ లభించింది.
డిసెంబర్ 17న భవన ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 70 వేల మందికి ఆహ్వానాలు పంపారు. ఇప్పటికే గత కొన్ని వారాలుగా, అనేక వజ్రాల వ్యాపార సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ భవనం 65,000 వజ్రాల నిపుణులకు వసతి కల్పించబోతోంది. ఆఫీసులతో పాటు, డైమండ్ బోర్స్ క్యాంపస్‌లో సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, రెస్టారెంట్లు, బ్యాంకులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లు, ఎంటర్టైన్మెంట్ ఏరియాలు, రెస్టారెంట్లు, సెక్యూరిటీతో కూడిన క్లబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
Under the progressive vision of Honourable PM Shri @narendramodi Ji, Surat is shining brighter than ever!
The Surat Diamond Bourse has claimed the title of the World's largest office building, surpassing the iconic Pentagon in the United States. This sparkling hub will… pic.twitter.com/YdyZkRHcvj
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) July 19, 2023