కృష్ణా: మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్లో ఇటీవల జరిగిన ఇఫ్తార్ విందులో పెడన 15వ వార్డు టీడీపీ ఇంఛార్జ్ కుర్షిద్ బేగం హాజరయ్యారు. అనంతరం తిరిగి ప్రయాణం అయ్యే సమయంలో రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలు పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం ఆమె మృతి చెందారు. ఆమె మరణం పట్ల ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.