NDL: నంది కొట్కూరులో ఇవాళ జీవో 98 బాధితులు 2వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. CPM పార్టీ నాయకులు నాగేశ్వరావు తమ బృందంతో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవో 98 ప్రకారం ఇళ్లు నిర్మించి, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPM పార్టీ నాయకులు 98 GO బాధితులు పాల్గొన్నారు.