»These Tips Will Help You To Stay Away From Processed Foods
processed foods : ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించండి
ప్రస్తుతం మన జీవన విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహారంలో అతిపెద్ద మార్పు సంభవించింది. ఈ రోజుల్లో చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.
processed foods : ప్రస్తుతం మన జీవన విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహారంలో అతిపెద్ద మార్పు సంభవించింది. ఈ రోజుల్లో చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ ప్రాసెస్డ్ ఫుడ్ మన ఆరోగ్యానికి హానికరం.. ప్రాసెస్ చేసిన ఫుడ్ తినకూడదని చాలాసార్లు మనసులో అనుకుంటూ ఉంటాం.. కానీ అందులో విఫలమవుతాం. మనకు ఆకలిగా అనిపించినప్పుడు తప్పనిసరిగా బయట తింటాము. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తయారుచేసే ప్రక్రియ చాలా అనారోగ్యకరమైనది. ఆహారం ఎక్కువ కాలం ఉండేందుకు రసాయనాలు కలుపుతారు. ఈ రసాయనాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. వాటి తయారీలో సువాసన పెంచేందుకు పలు హానికర పదార్థాలను కూడా వాడుతారు. కాబట్టే ప్రజలు వాటిని తినడానికి ఇష్టపడతారు. మీరు ప్రాసెస్ చేసిన ఆహారాలకు ఎలా దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
ఇంట్లో మీరే ఆహారం వండుకోండి
మీకు ఇష్టమైన ఆహారాన్ని ఇంట్లోనే సిద్ధం చేసుకుని తినండి. ఉదాహరణకు, మీరు సమోసాలు, పిజ్జాలు తినాలనుకుంటే, మీరు వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, తద్వారా మీరు పదార్థాల నాణ్యతను జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇందులో హెల్తీ ఐటమ్స్ వాడవచ్చు.
భోజనం ప్లాన్ చేయండి
మీ ఆహారంపై పూర్తి శ్రద్ధ వహించండి. ఇందుకోసం ముందుగా ఒక రోజంతా డైట్ ప్లాన్ సిద్ధం చేసుకోండి. మీరు ఈ జాబితాకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, స్మూతీలను జోడించవచ్చు. దీంతో సరైన సమయానికి భోజనం చేసి బయట తింటే అంత ఆకలి అనిపించదు.
బయట తక్కువ తినండి
అవుట్డోర్ ఫుడ్ రుచికరమైనది, ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు. కానీ ఇందులో అధిక మొత్తంలో కేలరీలు, ఉప్పు , కొవ్వు ఉంటుంది. అందువల్ల ఇది అనారోగ్యకరం. కాబట్టి బయటి ఆహారాన్ని పరిమితంగా తినండి. బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోండి. 15 రోజులకు లేదా నెలకు ఒకసారి మాత్రమే బయటి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
ప్యాక్ చేసిన స్నాక్స్ తినవద్దు
ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాన్ని స్నాక్స్‌గా తింటారు. కానీ అధిక కేలరీలు మరియు చక్కెరను కలిగి ఉండటం వల్ల ఇది మన ఆరోగ్యానికి హానికరం. అందుకే చిప్స్ వంటి ప్యాకేజ్డ్ స్నాక్స్ కాకుండా ఓట్స్, పనీర్ చీలా, ఆమ్లెట్, బువ్వ చిర్వా వంటివి తినొచ్చు. ప్యాకేజ్డ్ ఫుడ్ తింటుంటే.. కొనే సమయంలో దానిపై రాసి ఉన్న పదార్థాలను పూర్తిగా చదవండి.. తర్వాత కొనుక్కొండి.. తినండి.