AP: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ‘మాటతోనే చంపే రౌడీవా పెమ్మసాని.. వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్‌తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త’ అని ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారు’ అని ఇటీవల జగన్ విమర్శించడంతో ‘ఒక్క మాటతో చంపేయగలం’ అంటూ పెమ్మసాని హెచ్చరించారు.