BPT: శ్రీరామనవమి సందర్భంగా సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో భక్తిరసభరితంగా వేడుకలు నిర్వహించారు. 15వ వార్షికోత్సవంలో భాగంగా సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, గీత దంపతులు దాతలుగా సేవలందించారు. కంకణధారణ నుంచి మాంగల్యధారణ వరకు అన్ని ఘట్టాలు ఘనంగా జరిగాయి.