AP: హరికృష్ణ ట్రావెల్స్ యజమాని హరికృష్ణారెడ్డిని మార్కాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాయవరం దగ్గర బస్సును నిర్లక్ష్యంగా నడిపిన హరికృష్ణారెడ్డి.. ప్రమాదం తర్వాత ప్రయాణికులను వదిలి పరారయ్యాడు. హరికృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా కలిగిరిలో హరికృష్ణ ట్రావెల్స్ నడుపుతున్నాడు. నిన్న జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవదహనం అయిన విషయం తెలిసిందే.