AP: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ మృతదేహాలను బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. డీఎన్ఏ నివేదికల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. డీఎన్ఏ నివేదికలు రాగానే బంధువులకు మృతదేహాలను అప్పగించనున్నారు. అయితే, బస్సు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవదహనం అయిన విషయం తెలిసిందే.