KMM: ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా యడ్లపల్లి రమేష్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో 981 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కొప్పుల రవికుమార్ గెలుపొందారు. వారి గెలుపు పట్ల న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు.