NGKL: ప్రముఖ వ్యాపారవేత్త, చెన్నై షాపింగ్ మాల్ అధినేతగా గుర్తింపు పొందిన నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి సామాజిక సేవలో భాగంగా గొప్ప ఉదారతను చాటుకున్నారు. మర్రి రిటైల్ లిమిటెడ్ తరఫున ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు.