SRD: శ్రీరామనవమి పురస్కరించుకొని నారాయణఖేడ్ పట్టణానికి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ రావి ఆకుపై శ్రీ సీత రాములవారి చిత్రాలను రూపొందించి శుక్రవారం ఆవిష్కరించారు. అంతేకాకుండా ఆకులపై శ్రీరాముడి చిత్రాల కళాఖండాలను వివిధ రూపాల్లో కూడా చిత్రించి తనదైన ఆర్ట్ శైలిని నిరూపించారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరలై ఆర్టిస్ట్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి