తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాములో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. ఈవీఎం భద్రత, నిర్వహణ సంబంధిత అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.