బాపట్లలో గురువారం అర్ధరాత్రి రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద AMVI కిషోర్ బాబు బస్సుల రికార్డులు చెక్ చేశారు. ఎమర్జెన్సీ విండోలు సరిగా పనిచేస్తున్నాయా అని పరిశీలించి, ప్రమాదాల నివారణ చర్యలపై డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు.