JGL: కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు ‘తెలంగాణ సేవారత్న జాతీయ పురస్కారం’ లభించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకు ఈ అవార్డును అందజేశారు. విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించి ఈ గౌరవం అందించినట్లు తెలిపారు.