Australia: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. పోలింగ్ సమయం పూర్తయ్యింది. సిటీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. 32 నుంచి 40 శాతం వరకు మాత్రమే పోలింగ్ జరిగింది. ఒకతను మాత్రం ఓటు వేసేందుకు ఆస్ట్రేలియా (Australia) నుంచి వచ్చాడు. కాచిగూడకు చెందిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి కుమారుడు సౌరబ్ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు. ఓటు వేసేందుకు హైదరాబాద్ వచ్చాడు. గురువారం బర్కత్ పురలో గల తెలంగాణ యువతి మండలి పోలింగ్ బూత్ నెంబర్ 215లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఇక్కడ ఉండి పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. సిటీలో తక్కువ పోలింగ్ నమోదైంది. కానీ సౌరభ్ మాత్రం ఓటు వేసేందుకు ఆస్ట్రేలియా (Australia) నుంచి వచ్చారు.