Tammineni : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఓటేసేందుకు పోలింగ్ బూతులకు తరలివెళ్లారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఇటు కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి అగ్ర నాయకులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే ఓటు వేసేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు పోలింగ్ బూతులో ఊహించని షాక్ తగిలింది. ఓటరు ఐడీలోని తప్పుల కారణంగా తమ్మినేని వీరభద్రం తన ఓటు వేయలేకపోయారు. అయితే తమ్మినేని ఈ సారి ఎన్నికల్లో పాలేరు నియోజక వర్గం నుంచి సీపీఎం తరఫున బరిలో నిలిచారు. ఇటీవలే తమ్మినేని హైదరాబాద్ నుంచి తన ఓటును సొంతూరు తెల్దారుపల్లికి మార్చుకున్నారు. ఈ క్రమంలో ఓటరు ఐడీలో తప్పులు ప్రచురితమైయ్యాయి. దీని కారణంగా ఆయన పోలింగ్ బూతుకు వెళ్లి ఓటు వేయకుండానే వెనుదిరిగారు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.