VKB: యువతులు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఎస్సై రమేష్ కుమార్ సూచించారు. రోడ్డు గుర్తులు, సిగ్నల్స్, వేగ పరిమితుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. మద్యం సేవించి వాహనం నడపడం ఆత్మహత్యతో సమానమని, దీనివల్ల డ్రైవింగ్ సామర్థ్యం తగ్గి ప్రాణనష్టం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పారు.