AP: కన్న కుమార్తెను తండ్రి హతమార్చిన దారుణ ఘటన మార్కాపురం జిల్లాలో చోటుచేసుకుంది. కుమార్తె తులసి(9) మెడకు తీగ బిగించి హత్య చేశాడు. ఇంట్లో కుమార్తె కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారించగా.. అదే కాలనీలో మరో వివాహిత ఇంట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు.